రైతు కోటాలో వ్యవసాయ విద్య చదివేవారికి ఎకరం భూమి ఉంటే చాలు
రైతు కోటాలో వ్యవసాయ పట్టభద్ర విద్య ప్రవేశాలు పొందేవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. 3 ఎకరాలకు బదులు ఎకరం భూమి ఉంటే చాలని ఉత్తర్వులు ఇచ్చింది.
ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ కళాశాలల్లో అందుబాటులో ఉన్న సీట్లలో రైతు కుటుంబాలకు చెందిన వారికి 40శాతం రిజర్వేషన్ కల్పించారు.
వీరికి 3 ఎకరాల భూమి ఉండాలనే నిబంధన ఇప్పటి వరకు అమలు చేస్తున్నారు.
ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారికి అంతభూమి లేకపోవడం వల్ల అర్హత సాధించలేకపోతున్నారు.
ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. పరిశీలించిన ప్రభుత్వం ఎకరాకు తగ్గించింది.
విద్యార్థి తల్లిదండ్రుల్లో ఎవరి పేరుతో భూమి ఉన్నా సరిపోతుందని వివరించింది.
వీరు కనీసం 4 సం॥లు గ్రామీణ ప్రాంతంలోని పాఠశాలల్లో చదివి ఉండాలని స్పష్టం చేసింది.