Current Affairs Telugu Daily

మీ-సేవ ద్వారా అంగ వైకల్య సర్టిఫికెట్లు
అంగ వైకల్య స్థాయిని నిర్థరించే సదరం సర్టిఫికెట్ల జారీ విధానాన్ని సరళీకృతం చేస్తూ, మధ్యవర్తులను నియంత్రిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వైద్య ఆరోగ్యశాఖ 2018 ఏప్రిల్‌ 10న ఉత్తర్వులు జారీ చేసింది.
  • దివ్యాంగులకు వ్యయప్రయాసాలను తగ్గిస్తూ.. వేగంగా వారు ధ్రువపత్రాలను పొందేలా వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది.
  • ఈ మేరకు దివ్యాంగులు మీ-సేవా ద్వారా మాత్రమే అపాయింట్‌మెంట్‌ పొందాలి.
  • మెడికల్‌ బోర్డుల్లోని వైద్యులు అంగవైకల్యాన్ని నిర్థరించాక జారీచేసే సర్టిఫికెట్‌ కూడా మీ-సేవ ద్వారా పొందే అవకాశాన్ని కల్పించారు.
  • వైద్యుల డిజిటల్‌ సంతకాలతోనే ఈ ధ్రువపత్రాల జారీ జరగనుంది.
  • అంగ వైకల్యాన్ని వైద్యులు నిర్థరించే సమయంలోనూ ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు.
  • ఈ కొత్త విధానం 2018 జూన్‌ 1 నుంచి అమల్లోకి రానుంది.
  • ఇకపై కొత్త అపాయింట్‌మెంట్స్‌ ఇవ్వరు.
  • మే 25లోగా పెండింగులో ఉన్న సర్టిఫికెట్లను జారీచేయాలి. డిజిటల్‌ సంతకాలతో ధ్రువపత్రాల జారీ అనంతరం న్యాయం జరగలేదని భావిస్తే మళ్లీ అప్పీలు చేసుకునే అవకాశాన్నీ కల్పించారు.

views: 797

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams