అమరావతి నగర బృహత్తర ప్రణాళిక, ఆకృతికి IGBC గ్రీన్ సిటీ ప్లాటినమ్ అవార్డు దక్కింది. 2018 ఏప్రిల్ 10న జరిగిన ఆనంద నగరాల సదస్సులో IGBC ఛైర్మన్ ప్రేమ్ సి జైన్ ఈ అవార్డును సీఎం చంద్రబాబునాయుడుకు అందించారు.
సమీకృత బహుళ రవాణా వ్యవస్థ, వాణిజ్య వినోద సముదాయాలు, నిఘా వ్యవస్థ, పునరుత్పాదక ఇంధనం, వృథా నీటి నిర్వహణ, వర్షపు నీటి నిల్వ, స్మార్ట్ మీటరింగ్ వంటి వాటిలో IGBC ప్రమాణాలకు అనుగుణంగా అమరావతి నిర్మాణ శైలి ఉన్నందున ఈ అవార్డు దక్కింది.