Current Affairs Telugu Daily

అమెరికా శాసనకర్తలకు ఫేస్‌బుక్‌ సీఈఓ జుకర్‌బర్గ్‌ వాంగ్మూలం 
డేటా దుర్వినియోగం కాకుండా నియంత్రించేందుకు ఫేస్‌బుక్‌ కానీ, సంస్థ సభ్యులు కాని తగినంత కసరత్తు చేయలేదని ఆ సంస్థ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ 2018 ఏప్రిల్‌ 9న అమెరికా కాంగ్రెస్‌కు వెల్లడించారు. ఇందుకు శాసనకర్తలను క్షమాపణలు కోరారు. తమ బాధ్యతకు సంబంధించి తగినంత విస్తృత దృక్పథాన్ని ఏర్పర్చుకోలేకపోయామని, అది పెద్ద తప్పేనని లిఖితపూర్వకంగా అందజేసిన వాంగ్మూలంలో అంగీకరించారు. అమెరికా ఎన్నికల్లో రష్యా జోక్యాన్ని గుర్తించి ప్రతిస్పందించడంలో ఫేస్‌బుక్‌ చాలా నిదానంగా ఉందని అంగీకరించారు. లోపాలను అధిగమించి పనితీరు మెరుగుపర్చుకుంటామని హామీ ఇచ్చారు. అందుకు కొంత సమయం పడుతుందని, అయితే అందుకు తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. 
views: 953

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams