Current Affairs Telugu Daily

ఈ-ఆధార్‌లో కొత్త క్యూఆర్‌ కోడ్‌
ఈ-ఆధార్‌ కార్డులో ప్రస్తుతమున్న క్యూఆర్‌ కోడ్‌ స్థానంలో సురక్షితమైన డిజిటల్‌ సంతకంతో కూడిన క్యూఆర్‌ కోడ్‌ను భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (UIDAI) ప్రవేశపెట్టింది. క్యూఆర్‌ కోడ్‌ అనేది గీతతో కూడిన కోడ్‌. దీన్ని ఎలక్ట్రానిక్‌ యంత్రంతో స్కాన్‌ చేస్తే అందులో నిక్షిప్తం చేసిన వివరాలు కనిపిస్తాయి. ప్రస్తుత క్యూఆర్‌ కోడ్‌లో వ్యక్తి వివరాలు మాత్రమే ఉంటున్నాయి. మార్చిన కోడ్‌లో ఆధార్‌ కార్డుదారుడి ఫొటో కూడా ఉంటుంది.
UIDAI-Unique Identification Authority of India

views: 933



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams