Current Affairs Telugu Daily

నక్సల్స్‌ కోసం ఛత్తీస్‌గఢ్‌ పోలీసుల ప్రత్యేక పాటల ఆల్బం 
నక్సల్స్‌ జనజీవన స్రవంతిలో కలిసేలా ఛత్తీస్‌గఢ్‌ పోలీసులు వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. బస్తర్‌ డివిజన్‌లో నక్సల్స్‌ అరాచకాలను అరికట్టేందుకు స్థానిక భాషల్లో పాటలను వినిపించడం ద్వారా ప్రయోజనం ఉంటుందన్న విశ్వాసంతో ఈ చర్యలకు ఉపక్రమించారు.ఇందుకోసం నవ బిహన్‌ పేరుతో రూపొందించిన ఆల్బంలో మొత్తం 5 పాటలున్నాయి.
  • నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతాల్లో నివసించే గిరిజనుల బాధను ఈ పాటలు ప్రతిబింబిస్తాయి. నక్సల్‌ బాటను విస్మరించాల్సిందిగా అభ్యర్థిస్తాయి. నక్సలైట్ల కుటుంబాలు, బంధుమిత్రులంతా కూడా వారు హింసాత్మక మార్గాన్ని విడనాడాలని కోరుకుంటూ చేసిన అభ్యర్థనను ఈ ఆల్బంలో పొందుపరిచారు.
  • నవ బిహన్‌ అనగా స్థానిక భాషలో ‘సరికొత్త ఉషోదయం’ అని అర్థం
  • ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి - రమణ్‌సింగ్‌ 
  • ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌ - బలరాందాస్‌ టాండన్‌
  • ఛత్తీస్‌గఢ్‌ రాజధానులు - రాయ్‌పూర్‌, బిలాస్‌పూర్‌

views: 900Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams