Current Affairs Telugu Daily

బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ ల్యాండ్ అటాక్ మిస్సైల్
¤ బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రోయిజ్ క్షిపణికి సంబంధించిన భూతల దాడి రకాన్ని భారత నౌకాదళం విజయవంతంగా పరీక్షించింది.
      » బంగాళాఖాతంలో తేగ్ యుద్ధనౌక నుంచి ప్రయోగించిన ఈ అస్త్రం నేల మీదున్న లక్ష్యాన్ని సమర్థంగా ఛేదించింది.
      » దేశంలో ఈ తరహా క్షిపణిని పరీక్షించడం ఇదే తొలిసారి. సముద్రం నుంచి నేలపైన లక్ష్యాలను దాడి చేసే సత్తా ఇప్పటివరకు అమెరికా, రష్యా, బ్రిటన్, చైనాకు మాత్రమే ఉంది.
      » భారత నౌకాదళంలో ప్రధానమైన కోల్‌కతా, రణ్‌వీర్, తేగ్ తదితర తరగతులకు చెందిన యుద్ధ నౌకల నుంచి ఈ భూతల బ్రహ్మోస్ క్షిపణులను ప్రయోగించవచ్చు.
      » సముద్రంలో సురక్షిత దూరంలో ఉంటూనే శత్రువుకు సంబంధించిన భూభాగంలోని ఎంపిక చేసిన ప్రదేశాలపై అత్యంత కచ్చితత్వంతో దాడిచేసే సామర్థ్యం భారత్‌కు ఒనగూరుతుంది.

views: 964

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams