Current Affairs Telugu Daily

చిన్నారి మిత్ర న్యాయస్థానం ప్రారంభం 
ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితో కలిసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌  ‘చిన్నారి మిత్ర (ఛైల్డ్‌ ఫ్రెండ్లీ)’ న్యాయస్థానాన్ని హైదరాబాద్‌లోని హాకా భవన్‌లో శనివారం ప్రారంభించి ప్రసంగించారు. దేశవ్యాప్తంగా చిన్నారుల హక్కులకు భంగం కలుగుతోందని, వారిపై హింస పెరుగుతోందని ఆందోళన వ్యక్తంచేశారు. 
  • POCSO (Protection of Children from Sexual Offences Act), 2012 ప్రకారం ఛైల్డ్‌ ఫ్రెండ్లీ న్యాయస్థానాన్ని ఏర్పాటు చేసారు.
  • ఉమ్మడి హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిః జస్టిస్‌ రమేష్‌ రంగనాథన్‌
  • సుప్రీంకోర్టు న్యాయమూర్తిః జస్టిస్‌ మదన్‌ బి.లోకూర్‌ 
  • ఇప్పటివరకు ఛైల్డ్‌ ఫ్రెండ్లీ న్యాయస్థానాన్ని కలిగిన రాష్ట్రాలు గోవా, ఢిల్లీ, బెంగళూరు
  • హైదరాబాద్ లో ఏర్పాటు చేసినది దేశంలోనే 4వది.

views: 990

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams