Current Affairs Telugu Daily

కర్ణాటక ఎన్నికలు నది వివాదాల పూర్వాపరాలు 
  1924లో మద్రాసు ప్రెసిడెన్సీ-మైసూరు సంస్థానాల మధ్య ఈ నదీ జలాలపై ఒప్పందం కుదిరింది. 1991 వరకూ ఇదో ప్రజా సమస్యగా లేదు. అప్పటివరకూ రెండు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో వ్యవహరించాయి. 1991లో కావేరి నదీ జలాల పంపిణీకి దేశ అత్యున్నత న్యాయస్థానం జారీచేసిన తాత్కాలిక ఉత్తర్వుతో కావేరి నదీ జలాల వివాదం రాజుకుంది. అప్పట్లో కొందరి ప్రాణాలూ పోయాయి. ఆస్తులు బుగ్గయ్యాయి. 1991లో అత్యున్నత న్యాయస్థానం జారీచేసిన తాత్కాలిక ఉత్తర్వును పూర్వపక్షం చేసేలా.. అప్పటి ముఖ్యమంత్రి బంగారప్ప జారీచేసిన ఓ అత్యవసరాదేశం ఈ మంటల్ని మరింత రాజేసింది. ‘కర్ణాటకలో ప్రవహించే కావేరితో పాటు ఇతర నదులపై కర్ణాటకకే తప్ప ఇతరులకు హక్కులేదన్నది’ ఆ ఆదేశం సారాంశం. ఆ అత్యవసరాదేశాన్ని అత్యున్నత న్యాయస్థానం కొట్టేసి, పాలకుల్ని మందలించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పెద్దగా ఆదరణ లభించలేదు. బంగారప్ప సొంత కుంపటికీ ఎన్నికల్లో సానుకూల స్పందన కరవైంది.
మహదాయి నది గోవాకు ప్రధాన నీటి వనరు. దీన్ని అక్కడ మాండోవి నదిగా పిలుస్తారు. మహారాష్ట్రలో మహదేయ్‌ అంటారు. బెళగావి జిల్లా ఖానాపుర తాలూకా సహ్యాద్రి పర్వతాలు దాని జన్మస్థలం. కర్ణాటకలో 35 కిలోమీటర్లు ప్రవహించి తర్వాత గోవా ద్వారా మహారాష్ట్రను తాకుతూ అరేబియా సాగరంలో కలుస్తుంది. దీని ఉపనదుల్లో కలస, బందూరి కూడా ఉన్నాయి. మహదాయి నది నుంచి 24 టీఎంసీల నీరు ఇవ్వాలని కర్ణాటక అడుగుతోంది. నవలగొంద, నరగొంద తాలూకాల్ని కరవు పీడిస్తుండటంతో మహదాయికి అనుబంధంగా ఉన్న కళస, బండూరి ఉప నదుల నీటిని తమ ప్రాంతాలకు మళ్లించాలని ధారవాడ, గదగ్‌, బెళగావి జిల్లాల రైతులు ఆందోళన ప్రారంభించారు. 1980ల్లో అప్పటి ప్రభుత్వం నిపుణుల సిఫార్సు ప్రకారం మహదాయి నది నీటిన మలప్రభకు మళ్లించేందుకు ప్రయత్నించింది. దీన్ని అప్పుడు గోవా ఆక్షేపించింది. ఎస్‌.ఎం.కృష్ణ మంత్రివర్గంలో హెచ్‌.కె.పాటిల్‌ సాగునీటి మంత్రిగా ఉన్నపుడు నదీ జలాల మళ్లింపు పథకానికి కళసా-బందూరి పేరు పెట్టారు. కర్ణాటక ప్రయత్నాల్ని గోవా పాలకులు న్యాయస్థానం ద్వారా అడ్డుకున్నారు. 2009లో అత్యున్నత న్యాయస్థానం వివాద పరిష్కారానికి ట్రైబ్యునల్‌ను నియమించింది. విచారణ ఇంకా కొనసాగుతోంది.

views: 925

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams