Current Affairs Telugu Daily

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ సరిగాలేదని కాగ్‌ ఆక్షేపణ

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో ఏప్రిల్ 6న  కాగ్‌ నివేదికలను ప్రవేశపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక నిర్వహణ తీరు నుంచి ప్రభుత్వ రంగ సంస్థల్లో నష్టాల వరకు...పన్నుల వసూళ్లలో లోటుపాట్ల నుంచి అంచనాలు పెరుగుతూ పోతున్న ప్రాజెక్టుల వరకు భారత కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ నివేదిక (కాగ్‌) సమర్పించింది.
ప్రాథమిక విద్యకు మౌలిక వసతులే కరవయ్యాయని, బాలల సంఖ్యపై సరైన మదింపు లేదని నిందించింది. బడిమానేసే వారి వివరాల్లో ఒక నివేదికకు మరో నివేదికకు పొంతన ఏదీ అంటూ నిలదీసింది.
ఉపాధ్యాయులను బోధనేతర పనులకు వినియోగించడమేమిటని ప్రశ్నించింది.
రాబోయే ఏడేళ్లలో ఏకంగా రూ.76,888 కోట్ల మేర అప్పులు చెల్లించాల్సి ఉందని, ఈ భారం బడ్జెట్‌లపై ఎంతో ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేసింది.
కాగ్, ఆర్థిక బాధ్యత మరియు బడ్జెట్ నిర్వహణ చట్టం (FRBM) చట్టం 2005 ను సూచిస్తూ, 2015-20 సంవత్సరానికి 14 వ ఆర్థిక కమిషన్ సిఫారసు ప్రకారం ప్రభుత్వం ఈ చట్టాన్ని సవరించలేదు.14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రాతిపదికన రాష్ట్ర ప్రభుత్వానికి 2016–17లో రూ.4,370 కోట్ల మేర ఎక్కువ నిధులు సమకూరినప్పటికీ, ఈ నిధులను మూలధన ఆస్తుల ఏర్పాటుకు ఉపయోగించలేదు. 
 ప్రిన్సిపల్‌ అకౌంటెంట్‌ జనరల్‌ (ఆడిట్‌) టుచావాంగ్‌

views: 1006

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams