Current Affairs Telugu Daily

దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హైకి 24 ఏళ్ల జైలుశిక్ష
దక్షిణ కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హైకి అవినీతి కేసులో 24 ఏళ్ల జైలుశిక్ష పడింది. లంచం, అధికార దుర్వినియోగం వంటి పలు కేసుల విచారణలో పార్క్‌ దోషిగా తేలారు.
  • ప్రముఖ వ్యాపారవేత్త చోయి సూన్‌ సిల్‌తో కలసి దాదాపు రూ.140 కోట్లకు పైగా డబ్బును పార్క్‌ లంచంగా డిమాండ్‌ చేశారని న్యాయమూర్తి కిమ్‌ సే యూన్‌ పేర్కొన్నారు.
  • పార్క్‌కు 24 ఏళ్ల పాటు జైలుశిక్షతో పాటు 16.9 మిలియన్‌ అమెరికా డాలర్ల జరిమానా విధించారు.
  • దక్షిణ కొరియా నియంత పార్క్‌ చుంగ్‌ హీ కుమార్తె అయిన గ్వెన్‌ 2013లో అధికారంలోకి వచ్చారు.
  • నాలుగేళ్ల లోపే ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో ఆందోళనల మధ్య ఆమె పదవి నుంచి వైదొలిగారు. 
  • 66 ఏళ్ల అవివాహితురాలైన పార్క్‌ గ్వెన్‌ హై దక్షిణ కొరియా తొలి మహిళా అధ్యక్షురాలు 

views: 964

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams