Current Affairs Telugu Daily

రెండు కొత్త భాషలు వాల్మీకి, మల్హార్‌ 
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న పంచాణన్‌ మొహంతి రెండు కొత్త భాషలను వెలుగులోకి తీసుకొచ్చారు. వీటిని వాల్మీకి, మల్హార్‌గా గుర్తించారు.
  • ఒడిశాలోని కొరాపుట్‌, ఏపీ సరిహద్దు జిల్లాల్లో పలువురు మాట్లాడుతున్న భాషలకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని కొన్ని నెలలపాటు శ్రమించి సేకరించారు.
  • యూకేకి చెందిన అంతర్జాతీయ భాషా పరిశోధన జర్నల్‌లో సంబంధిత పరిశోధన పత్రం ఇటీవల ప్రచురితమైందని మొహంతి వెల్లడించారు.
  • మల్హార్‌ భాష భువనేశ్వర్‌కి సుమారు 165 కిలోమీటర్ల దూరంలోని అటవీ ప్రాంతంలో వినియోగిస్తున్నారని తెలిపారు.
  • ఈ భాషల్ని పశ్చిమబెంగాల్‌, ఝార్ఖండ్‌, బిహార్‌లోని కొన్ని ప్రాంతాల్లోనూ మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. 

views: 977

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams