Current Affairs Telugu Daily

ఐక్యరాజ్యసమితి భద్రతామండలి ఉగ్ర జాబితా సవరణ
పాకిస్థాన్‌లో ఉగ్ర కార్యకలాపాలు ఉద్ధృత స్థితికి ఐక్యరాజ్య సమితి తాజా గణాంకాలు అద్దం పట్టాయి. ఉగ్ర ముద్ర పడిన వ్యక్తులు, సంస్థల జాబితాను భద్రతామండలి సవరించగా ఒక్క పాక్‌కు చెందిన ఉగ్రవాదులు, ముష్కర సంస్థలకే అందులో 139 స్థానాలు ఖరారయ్యాయి.
  • పాక్‌లో జీవించిన, ఆ దేశం నుంచి కార్యకలాపాలు కొనసాగించిన, పాక్‌లోని ముష్కర సంస్థలతో సంబంధాలున్న ఉగ్రవాదులు, ఉగ్రసంస్థలు అందులో భాగం. జాబితాలోని మొత్తం ఉగ్రవాదులు, ఉగ్రసంస్థల సంఖ్య తెలియరాలేదు.
  • లష్కరే తొయిబా, జైషే మహ్మద్‌ వంటి ఉగ్రవాద సంస్థలతోపాటు 1993 నాటి ముంబయి పేలుళ్ల సూత్రధారి దావూద్‌ ఇబ్రహీం, 26/11 ముంబయి దాడుల సూత్రధారి హఫిజ్‌ సయీద్‌ పేర్లు జాబితాలో ఉన్నాయి.
  • సయీద్‌తోపాటు అతడి అనుచరులు అబ్దుల్‌ సలామ్‌, జాఫర్‌ ఇక్బాల్‌పై ఉగ్ర ముద్ర పడిందని.. ఆ ముగ్గురి కోసం ఇంటర్‌పోల్‌ కూడా వెతుకుతోందని భద్రతామండలి తెలిపింది.
  • భారతీయుడైన దావూద్‌ ఇబ్రహీం వద్ద పాక్‌ పాస్‌పోర్టులు చాలా ఉన్నాయని వెల్లడించింది. కరాచీలోని నూరాబాద్‌లో విలాసవంతమైన భవనం, పలు దేశాల్లో ఆస్తులున్నాయని పేర్కొంది.
  • తాజా జాబితాలో అయ్‌మన్‌ అల్‌-జవహిరి అగ్రస్థానంలో ఉన్నాడు. అతడు అల్‌ఖైదా మాజీ అధినేత ఒసామాబిన్‌ లాడెన్‌ వారసుడు. అయ్‌మన్‌ అఫ్గానిస్థాన్‌-పాకిస్థాన్‌ సరిహద్దుల్లో నక్కిఉన్నాడని భద్రతామండలి పేర్కొంది. అతడి అనుచరులు పలువురు ఉగ్ర జాబితాలో ఉన్నారని.. వారూ అతనితోపాటే తలదాచుకుంటున్నారని తెలిపింది.
  • అయ్‌మన్‌ తర్వాతి స్థానంలో అంతర్జాతీయ ఉగ్రవాది రామ్జీమహ్మద్‌ బిన్‌ అల్‌-షీబాప్‌ా ఉన్నాడని పేర్కొంది. యెమన్‌ జాతీయుడైన అతడు కరాచీలో అరెస్టయ్యాడని.. ప్రస్తుతం అమెరికా అదుపులో ఉన్నాడని వెల్లడించింది.

views: 1073

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams