Current Affairs Telugu Daily

మధ్యప్రదేశ్‌లో ఐదుగురు బాబాలకు మంత్రి హోదా 
మధ్యప్రదేశ్‌లో ఐదుగురు బాబాలకు బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర సహాయ మంత్రి హోదా కల్పించింది. నర్మదానంద్‌ మహారాజ్‌, హరిహరానంద్‌ మహారాజ్‌, కంప్యూటర్‌ బాబా, భయ్యూ మహారాజ్‌, పండిట్‌ యోగేంద్ర మహంత్‌కు మంత్రి హోదా లభించింది.
  • నర్మదా నది సంరక్షణకు ఏర్పాటైన ‘జన్‌జాగృక్త అభియాన్‌ సమితి’లో 2018 మార్చి 31న వీరంతా నియమితులయ్యారు.
  • సమితి సభ్యులుగా వారంతా తమ పనులను మరింత సులువుగా చేపట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
  • సహాయ మంత్రి హోదా కల్పించిన నేపథ్యంలో ఇద్దరు బాబాలు నర్మద సంరక్షణ పనుల్లో అవినీతికి వ్యతిరేకంగా చేపట్టదలచిన ఉద్యమాన్ని విరమించారు.
  • యోగేంద్ర మహంత్‌తో కలిసి కంప్యూటర్‌ బాబా ఏప్రిల్‌ 1 నుంచి మే 15 వరకు రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
  • నర్మద ఒడ్డున మొక్కలు నాటే కార్యక్రమంలో అవినీతి చోటు చేసుకుందని.. అలాగే అక్రమంగా ఇసుక తవ్వకాలను నిరోధించాలని డిమాండ్‌ చేస్తూ ప్రతి జిల్లాలోనూ యాత్ర చేపట్టేందుకు ఆయన నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన ప్రచార సామగ్రిని కూడా సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు.
  • నర్మద నదీ సంరక్షణకు సాధువులతో కమిటీ ఏర్పాటు.. తదితర డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చినందున రథయాత్రను విరమించుకుంటున్నట్లు కంప్యూటర్‌ బాబా, యోగేంద్ర మహంత్‌లు ప్రకటించారు.
  • మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి - శివరాజ్ సింగ్ చౌహాన్ 

views: 993

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams