ఎన్నారైలకు ఐసీఐసీఐ బ్యాంక్ వాట్సాప్, ఇ-మెయిల్ ద్వారా డబ్బులు పంపే సేవలు
ఐసీఐసీఐ బ్యాంక్ విదేశాల్లోని భారతీయుల కోసం సోషల్ పే అనే కొత్త సేవను ప్రవేశపెట్టింది. దీని ద్వారా భారత్లోని తమ స్నేహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు డబ్బులు పంపించడానికి సామాజిక మాధ్యమాల్ని వాడుకోవచ్చని తెలిపింది. వాట్సాప్, ఇ-మెయిల్ ఉపయోగించుకుని డబ్బు పంపవచ్చని ఖాతాదారులకు సూచించింది.
డబ్బు పంపాలనుకునే వారు 'MONEY2INDIA' యాప్లో నమోదు చేసుకోవల్సి ఉంటుందని, ఎన్ఆర్ఐలు సౌకర్యవంతంగా, సురక్షితంగా తమ స్నేహితులకు, కుటుంబ సభ్యులకు డబ్బు పంపేందుకు ఈ సదుపాయం తోడ్పడుతుందని బ్యాంకు పేర్కొంది.