Current Affairs Telugu Daily

370వ అధికరణం తాత్కాలికం కాదు: సుప్రీం
జమ్మూ-కశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే రాజ్యాంగంలోని 370వ అధికరణం తాత్కాలిక నిబంధనేమీ కాదని సుప్రీంకోర్టు 2018 ఏప్రిల్‌ 3న స్పష్టం చేసింది. ఈ విషయమై 2017లోనే సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఓ తీర్పును జస్టిస్‌ ఏకే గోయల్‌, జస్టిస్‌ ఆర్‌ఎఫ్‌ నారిమన్‌తో కూడిన ధర్మాసనం గుర్తుచేసింది.
  • 370వ అధికరణం తాత్కాలికమంటూ ప్రకటించాలని కోరుతూ గతంలో దాఖలైన వ్యాజ్యాన్ని 2017 ఏప్రిల్‌లో డిల్లీ హైకోర్టు కొట్టివేసింది.
  • దీంతో పిటిషనర్‌ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
  • ఈ వ్యాజ్యం విచారణ సందర్భంగా కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా, జమ్మూ-కశ్మీర్‌ ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ వాదనలు వినిపించారు. అనంతరం ఏఎస్‌జీ విజ్ఞప్తి మేరకు ధర్మాసనం విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

views: 967



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams