Current Affairs Telugu Daily

మైనార్టీ ఆర్థిక సంస్థ విభజనకు ఉత్తర్వులు
ఉమ్మడి రాష్ట్ర మైనార్టీ ఆర్థిక సంస్థకు సంబంధించి ఉద్యోగులు, కార్యాలయాల విభజనకు ప్రభుత్వం 2018 ఏప్రిల్‌ 2న ఉత్తర్వులు జారీ చేసింది. విభజనపై గతంలో వేసిన నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు ఉమ్మడి సంస్థలో పనిచేసే ఉద్యోగులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ మైనార్టీ ఆర్థిక సంస్థకు 58:42 నిష్పత్తిలో విభజించనున్నారు.
  • బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్ని పరిగణనలోకి తీసుకున్న నిపుణుల కమిటీ ఈ మేరకు సిఫార్సు చేసింది.
  • దీని ప్రకారం ఉమ్మడి సంస్థలోని 117 మంది ఉద్యోగుల్లో 66 మంది ఆంధ్రప్రదేశ్‌కు, 51 మంది తెలంగాణకు చెందనుండగా.. ముఖ్య కార్యాలయాల్లో పనిచేసే వారిలో ఆంధ్రప్రదేశ్‌కు 14 మందిని, తెలంగాణకు 11 మందిని కేటాయించారు.
  • ఉమ్మడి మైనార్టీ సంస్థకు ఉన్న మొత్తం 22 కార్యాలయాల్లో 12 ఆంధ్రప్రదేశ్‌కు, 10 తెలంగాణకు దక్కనున్నాయి.
  • జిల్లా కార్యాలయాల్లోని 45 మంది శాశ్వత ఉద్యోగుల్లో 22 మంది ఆంధ్రప్రదేశ్‌కు, 23 మంది తెలంగాణకు కేటాయించారు.
  • ఉమ్మడి క్రైస్తవ మైనార్టీ సంక్షేమ సంస్థను కూడా ఇదే తరహాలో విభజించారు. ఈ సంస్థకు చెందిన ఇద్దరు శాశ్వత ఉద్యోగుల్లో ఒకరిని ఆంధ్రప్రదేశ్‌కు, మరొకరిని తెలంగాణకు కేటాయిస్తూ 2018 ఏప్రిల్‌ 2న ఉత్తర్వులు జారీ అయ్యాయి.

views: 992

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams