Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌కు పితృవియోగం 
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి చీఫ్‌విప్‌ పయ్యావుల కేశవ్‌ తండ్రి, రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే వెంకట నారాయణప్ప(86) అనంతపురంలో 2018 ఏప్రిల్‌ 2న మృతి చెందారు. 1931లో నవంబరు 9న నారాయణప్ప జన్మించారు. స్వగ్రామం ఉరవకొండ మండం కౌకుంట్ల. జిల్లా కాంగ్రెసు అధ్యక్షుడిగా పనిచేసిన ఈయన ..1975లో రాయదుర్గం నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి  విజయం సాధించారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత పార్టీలో చేరి తెలుగురైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. నారాయణప్పకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. వీరిలో పయ్యావుల కేశవ్‌ పిన్న వయస్కులు. 

views: 1162

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams