Current Affairs Telugu Daily

ఏపీలో క్రమబద్ధీకరణ గడువు మే నెలాఖరు వరకు పెంపు 
పట్టణాల్లో అక్రమ భవనాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథక (బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌) గడువు మరో రెండు నెలలు పొడిగిస్తూ ఆంధ్రప్రదేశ్‌ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 2018 ఏప్రిల్‌ 2న ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ పురపాలక, నగరపాలక సంస్థల నుంచి వచ్చిన ప్రతిపాదనలు పరిశీలించిన ప్రభుత్వం 2018 మార్చి నెలాఖరుతో ముగిసిన గడువును 2018 మే నెలాఖరువరకు పొడిగించింది.
  • అనుమతులు తీసుకోకుండా చేసే భవన నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ కోసం 2007లో ఉమ్మడి రాష్ట్రంలో ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందించారు.
  • 2013లో క్రమబద్ధీకరణ కోసం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి పురపాలక, నగరపాలక సంస్థల్లో అక్రమ భవనాలు, లేఅవుట్లపై వచ్చిన దరఖాస్తుల్లో కొన్నింటిని పరిష్కరించింది.
  • అపరిష్కృత దరఖాస్తులపై ప్రజు, వ్యాపార సంస్థల నుంచి వచ్చిన విన్నపాలపై 2016లో రాష్ట్రంలో మళ్లీ క్రమబద్ధీకరణకు అనుమతులిచ్చారు.
  • ఇప్పటికే రెండుసార్లు గడువు పెంచిన ప్రభుత్వం తాజాగా మరోసారి అవకాశమిచ్చింది. వచ్చే నెలాఖరులోగా పెండింగులోని బీపీఎస్‌, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులను పరిష్కరించాలని పురపాలక, నగరపాలక సంస్థలకు ప్రభుత్వం సూచించింది.

views: 911

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams