Current Affairs Telugu Daily

200 అగ్రశ్రేణి వర్సిటీల్లో ఐఐటీ డిల్లీ, డిల్లీ యూనివర్సిటీలకు చోటు 
ప్రపంచంలోని 200 అగ్రస్థాయి విశ్వవిద్యాయాల్లో మన దేశానికి చెందిన రెండు సంస్థలు చోటు దక్కించుకున్నాయని అసోచామ్‌-యెస్‌ ఇనిస్టిట్యూట్‌ సంయుక్త అధ్యయన నివేదిక వెల్లడించింది.
  • 49 అత్యుత్తమ విశ్వవిద్యాయాలతో అమెరికా అగ్రస్థానంలో నిలిచింది.
  • బ్రిటన్‌-30, జర్మనీ-11, చైనా, ఆస్ట్రేలియాలు 8 చొప్పున ఉత్తమ విశ్వవిద్యాయాలను కలిగి ఉన్నాయని నివేదిక పేర్కొంది.
  • ఈ జాబితాలో మన దేశం నుంచి ఐఐటీ డిల్లీ, డిల్లీ విశ్వవిద్యాయాలకు మాత్రమే ప్రవేశం లభించింది.
  • ప్రపంచంలోని అత్యుత్తమ విద్యా విధానాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉందని నివేదిక పేర్కొంది.
  • ప్రతిభావంతులైన వారందరూ అభివృద్ధి చెందిన దేశాల్లో విద్యాభ్యాసం, పరిశోధనలకు ప్రాధాన్యమిస్తున్నారు. తద్వారా ఆయా దేశాలకు మేధో, ఆర్థికపరమైన లబ్ధి కలుగుతోంది.
  • సుమారు 6 లక్షల మంది భారతీయ విద్యార్థులు విదేశాల్లో విద్య కోసం ఏడాదికి రూ.లక్షా 34వే కోట్లు (20 బిలియన్‌ డాలర్లు) వెచ్చిస్తున్నారని  నివేదిక అంచనా వేసింది.
  • మనదేశంలో సైన్స్‌, కామర్స్‌, ఆర్ట్‌ విభాగాల్లో పట్టభద్రులు అయిన వారిలో ఉద్యోగిత 25శాతం మాత్రమేనని 2013నాటి జాతీయ ఉద్యోగిత నివేదిక (నేషనల్‌ ఎంప్లాయబిలిటీ రిపోర్టు)ను ఉటంకించింది.
  • పరిశోధనలకు ప్రోత్సాహలేమి, ఉద్యోగ లభ్యత, నవకల్పన, వ్యాపారాపేక్షతలు తక్కువగా ఉండటం వంటి సమస్యలను మన ఉన్నత విద్యా సంస్థలు ఎదుర్కొంటున్నాయని విశ్లేషించింది.
  • ఆర్థిక వాస్తవికతలు, పారిశ్రామిక అవసరాలకు తగిన విధంగా, భవిష్యత్తు పరిణామాలను అంచనావేస్తూ తగిన విద్యా చట్రాన్ని నిర్మించుకోవటం ద్వారానే ప్రస్తుత సమస్యను అధిగమించగలమని నివేదిక అభిప్రాయపడింది.

views: 969



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams