Current Affairs Telugu Daily

2018-19 మధ్య కల్లా గరిష్ఠానికి నిరర్థక ఆస్తులు : క్రిసిల్‌ నివేదిక 
బ్యాంకుల నిరర్థక ఆస్తులు అంతకంతకు పెరగనున్నాయని రేటింగ్‌ ఏజెన్సీ క్రిసిల్‌ అంచనా వేసింది. అదే సమయంలో బ్యాంకర్లపై కొనసాగుతున్న దర్యాప్తు వల్ల  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రుణ వృద్ధి కుంటుపడవచ్చని వెల్లడించింది. 
  • 2018 ఫిబ్రవరి 12న ప్రకటించిన మొండి బకాయిల పరిష్కార నిబంధనల భారీ సవరణతో 2018 మార్చిలో మొండి బకాయిలు భారీగా పెరిగాయి. 
  • 2018-19 మధ్య కల్లా మొండి బకాయిలు గరిష్ఠ స్థాయికు చేరి ఆ తర్వాత క్రమంగా తగ్గుతూ రావొచ్చు. 
  • మార్చి త్రైమాసికంలో స్థూల నిరర్థక ఆస్తు(ఎన్‌పీఏ) 11 శాతం పెరగవచ్చు. అంతక్రితం ఏడాది ఇదే సమయంలో 9.4 శాతంగా ఉంది. ప్రస్తుత త్రైమాసికంలో ఎన్‌పీఏలు 11.5 శాతం గరిష్ఠానికి చేరి మార్చి 2019 కల్లా 10.3 శాతానికి తగ్గవచ్చు. 
  • ఒక్కసారి ఎన్‌పీఏ సమస్య తొలగితే.. రుణ వృద్ధి, నిర్వహణ లాభం వంటి ప్రధాన కార్యకలాపాలపై దృష్టి మరలుతుంది. అయితే రూ.12,900 కోట్ల నీరవ్‌ మోదీ కుంభకోణానికి తోడు, ఐసీఐసీఐ బ్యాంక్‌పై క్విడ్‌ ప్రొ కో ఆరోపణలు ప్రతికూలంగా పనిచేయవచ్చు. ఈ మోసాలు రుణ వృద్ధి కుంటుపడేలా చేయడానికి ఆస్కారం ఉంది. 
  • కార్పొరేట్లు చాలా వరకు మూలధన అవసరాలకు వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలపై ఆధారపడుతుండడంతో కార్పొరేట్‌ రుణ వృద్ధి మరీ ఎక్కువగా ఏమీ ఉండబోదు. 
  • రిటైల్‌ రుణాల్లో 20%, వ్యవసాయంలో 15%, ఎస్‌ఎమ్‌ఈల్లో 10%, కార్పొరేట్‌ రుణాల్లో 5.5 శాతం చొప్పున వృద్ధి నమోదు కావొచ్చు. 
  • ఎన్‌పీఏకు చేస్తున్న అధిక కేటాయింపుల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం ఒత్తిడిలో ఉండొచ్చు. అయిదేళ్ల ఎన్‌పీఏ సమస్య 2018-19లో బాగా ముదరనుండడంతో ఈ ఏడాదిని బ్యాంకింగ్‌ వ్యవస్థ అంత త్వరగా మరచిపోలేదు.

views: 910

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams