Current Affairs Telugu Daily

ఓ వైపు మెదడుకు ఆపరేషన్..మరోవైపు మురళీగానం ఆలాపన
ఓ వైపు మెదడుకు ఆపరేషన్ జరుగుతుంటే వేణుగానాన్ని ఆలపించి ఓ బామ్మ సంచలనం సృష్టించారు. ఈ అరుదైన ఘటన అమెరికాలోని మెమోరియల్‌ హెర్మన్‌ టెక్సాస్‌ మెడికల్‌ సెంటర్‌ ఆసుపత్రిలో చోటు చేసుకుంది.
  • వేణువు ఊదడంలో 63 ఏళ్ల అన్నా హెన్రీ దిట్ట. అయితే ఆమెను చేతులు వణికించే రుగ్మత (ఎసెన్షియల్‌ ట్రెమర్‌) వేధించేది. ఈ నాడీ వ్యాధికి చికిత్సలో భాగంగా మెదడుకు శస్త్రచికిత్స అవసరం అవుతుందని వైద్యులు సూచించారు.
  •  మెదడును విద్యుత్‌తో ప్రేరేపించే సమయంలో హెన్రీ వేణువును ఊదాల్సి ఉంటుందనీ చెప్పారు. దీంతో సూక్ష్మ ఎలక్ట్రోడ్‌ను మెదడులోకి చొప్పించి విద్యుత్‌తో ప్రేరేపిస్తుండగా.. లయబద్ధంగా హెన్నీ వేణువును ఊదారు.
  • ఆ సమయంలో చేతు వణుకుతున్నాయో లేదో జాగ్రత్తగా గమనిస్తూ వైద్యులు చికిత్సను కొనసాగించారు. విద్యుత్‌ ప్రేరణను నియంత్రించేందుకు హెన్రీ ఛాతికి ఓ బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు.
  • చివరికి ఈ చికిత్స విజయవంతమైంది. ఇకపై ఆమె ఎలాంటి ఔషధాలు వాడాల్సిన పనిలేదని వైద్యులు తెలిపారు. చికిత్స నిర్వహిస్తుండగా ఆసుపత్రి మంచంపై పడుకొని ఆమె వేణువును ఊదుతున్న దృశ్యాలు ఇంటర్నెట్‌లో స్వైర విహారం చేశాయి.
  • మెదడులోని కొన్ని సర్క్యూట్‌లు అసాధారణంగా పనిచేస్తున్నప్పుడు ఇలాంటి రుగ్మతలు వేధిస్తాయి. వీటిని సరిచేసేందుకు వైద్యు లు విద్యుత్‌తో మెదడును ప్రేరేపిస్తుంటారు.
  • హెన్రీకి ఈ రుగ్మత తండ్రి నుంచి సంక్రమించింది. దీంతో మంచినీళ్లు తాగడం, సంతకం పెట్టడం లాంటి చిన్నచిన్న పనులు ఆమె సరిగా చేయలేకపోయేవారు. ఈ లక్షణాలు రోజురోజుకీ మరింత తీవ్రరూపం దాల్చడంతో ఆమె వైద్యుల్ని ఆశ్రయించారు.

views: 910

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams