Current Affairs Telugu Daily

పాదాలతో పెయింటింగ్‌లో గిన్నిస్‌ రికార్డు సాధించిన జాహ్నవి
గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్సులో చోటుసంపాదించుకున్న మాగంటి జాహ్నవి ఇటీవల కాలి(పాదం)తో 140 అడుగుల అతిపెద్ద చిత్రం గీసింది. 2018 ఏప్రిల్‌ 1న ఉండవల్లిలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దంపతులను కలవగా, జాహ్నవికి జ్ఞాపిక అందించి అభినందించారు.
  • 100 చదరపు అడుగుల కాన్వాస్‌పై పాదాలతో వేసిన చిత్రం ఇప్పటివరకూ గిన్నిస్‌ రికార్డుగా ఉంది.
  • దీన్ని అధిగమిస్తూ 140 అడుగుల కాన్వాస్‌పై చిత్రంగీసి సరికొత్త రికార్డును సృష్టించింది.
  • జాహ్నవి బ్రిటన్‌లోని వార్విక్‌ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ విద్యనభ్యసిస్తోంది.
  • హైదరాబాద్‌ ల్యాంకో హిల్స్‌ టెన్నిస్‌ కోర్టులో 140 చదరపు అడుగుల స్థలంలో మూడు గులాబీ పువ్వులు, మూడు ఆకులు, పచ్చదనంతో కూడిన భారీ పెయింటింగ్‌ వేసి జాహ్నవి గిన్నిస్‌ రికార్డు సాధించారు.

views: 966

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams