Current Affairs Telugu Daily

మలయాళ చిత్ర నిర్మాతలపై నైజీరియా నటుడు జాతివివక్ష ఆరోపణలు 
‘సుడాని ఫ్రమ్‌ నైజీరియా’ అనే మలయాళ సినిమాలో నటించిన నైజీరియా నటుడు శామ్యూల్‌ అబియోలా రాబిన్సన్‌ తనపై నిర్మాతలు జాతివివక్ష చూపించినట్లు ఆరోపణలు చేశారు. నల్ల జాతీయుడైనందుకే తనకు మిగతా నటుల కన్నా తక్కువ పారితోషికం చెల్లించారని ఫేస్‌బుక్‌ వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు.
  • ఆయన ముఖ్యపాత్ర పోషించిన ‘సుడాని ఫ్రమ్‌ నైజీరియా’ ఇటీవలే విడుదలైంది.
  • ఈ సినిమాలోని ఇతర భారతీయ నటుల కన్నా తనకు చాలా తక్కువ పారితోషికం ఇచ్చారని.. ప్రాచుర్యం, అనుభవం విషయంలో వారికన్నా పైస్థాయిలో ఉన్నప్పటికీ తనకు అన్యాయం జరిగిందని రాబిన్సన్‌ ఆరోపించారు.
  • అయితే తనకు ఎవరి నుంచీ ప్రత్యక్షంగా వివక్ష ఎదురుకాలేదని.. కేరళలో పనిచేసిన రోజులన్నీ తాను ఆస్వాదించానని తెలిపారు. 

views: 966



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams