Current Affairs Telugu Daily

ఫోర్బ్స్‌ జాబితాలో  HCU విద్యార్థికి 30వ స్థానం 
హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధక విద్యార్థి రాహుల్‌ గాయమ్‌కు ఫోర్బ్స్‌ జాబితాలో 30వ స్థానం దక్కింది. 2018లో ఆసియా పరిధిలో ఉన్న 300 మంది యంగ్‌ ఇన్నోవేటర్లలో తొలి 30 మందిలో ఒకరిగా నిలిచారు.
  • ‘ఫోర్న్‌-30 అండర్‌-30 ఏసియా 2018’ స్థానాన్ని కైవసం చేసుకున్నారు.
  • రాహుల్‌ HCUలో ఫిజిక్స్‌లో ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్స్‌ కోర్సును పూర్తి చేశారు. 2013లో HCUలో పీహెచ్‌డీ కోర్సులో చేరారు.
  • 2010లో టీ-హబ్‌లో ఎక్ట్రిక్‌ వెహికల్‌ స్టార్టప్‌ను గాయమ్‌ సోదరులు రాహుల్‌ గాయమ్‌, రాజా గాయమ్‌లి  కలసి రూపొందించారు. దీనికి గాయమ్‌ మోటార్‌ వర్క్స్‌గా నామకరణం చేశారు. దీని ద్వారానే ప్రపంచంలోనే తొలి ఆటో రిక్షా లీ-అయాన్‌ బ్యాటరీతో నడిచే దాన్ని రూపొందించారు.
  • ఎలక్ట్రిక్‌ వాహనాల పరిశ్రమల్లో ఇంటిగ్రేటెడ్‌ కూలింగ్‌ సిస్టమ్‌, క్వాడ్రా డ్రైవ్‌ సిస్టమ్‌, స్మార్ట్‌-బీఎంఎస్‌ బ్యాటరీ మానిటరింగ్‌ సిస్టమ్‌ వంటి వాటి రూపకల్పనలో రాహుల్‌  కృషి చేశారు.

views: 1029

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams