Current Affairs Telugu Daily

దలైలామా భారత్‌కు వచ్చి 60 ఏళ్లవుతున్న సందర్భంగా ‘థాంక్యూ ఇండియా’ కార్యక్రమం
బౌద్ధ గురువు దలైలామా భారత్‌కు వచ్చి 60 ఏళ్లవుతున్న సందర్భంగా టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం ఏడాదికాల ‘థాంక్యూ ఇండియా’ ప్రచారాన్ని 2018 మార్చి 31న ధర్మశాలలో ప్రారంభించింది. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనైన దలైలాలా తనకు తలదాచుకోవడానికి ఆశ్రయమిచ్చిందంటూ భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.
  • నాడు తనకు రక్షణ కల్పించిన అసోం భద్రతా సిబ్బంది నరేన్‌ చంద్రదాస్‌ను ఆయన కృతజ్ఞతాపూర్వకంగా హత్తుకున్నారు.
  • ఈ కార్యక్రమాన్ని డిల్లీలో ఏర్పాటు చేయాలని టిబెట్‌ ప్రవాస ప్రభుత్వం మొదట భావించింది.
  • చైనాతో సంబంధాలపై ప్రభావం ఉండొచ్చన్న భావనతో ఈ కార్యక్రమంలో పాల్గొనరాదని భారత ప్రభుత్వం అధికారులకు సూచించింది.
  • దీంతో కార్యక్రమాన్ని ధర్మశాలకు మార్చారు.
  • అయితే, కేంద్రం తన మనసు మార్చుకుంది. ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రి మనీష్‌శర్మతో పాటు బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్‌, ఎంపీలు శాంతకుమార్‌, సత్యవ్రత్‌చతుర్వేది పాల్గొన్నారు.

views: 949

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams