Current Affairs Telugu Daily

తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా దామోదర్‌రెడ్డి 
తెలంగాణ హైకోర్టు న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా సి.దామోదర్‌రెడ్డి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి పొన్న అశోక్‌గౌడ్‌పై ఆయన 13 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దామోదర్‌రెడ్డికి 760 ఓట్లు రాగా.. అశోక్‌గౌడ్‌కు 747 ఓట్లు పడ్డాయి. దామోదర్‌రెడ్డి ప్రస్తుతం టీపీసీసీ న్యాయవిభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.
  • న్యాయవాదుల సంఘం ఉపాధ్యక్షుడిగా సి.హరిప్రీత్‌ 771 ఓట్లతో విజయం సాధించారు.
  • రెండు కార్యదర్శుల పోస్టులకు అయిదుగురు పోటీపడగా.. కోమటిరెడ్డి వెంకట నర్సింహారెడ్డి, సుంకరి జనార్దన్‌గౌడ్‌ ఎన్నికయ్యారు.
  • సంయుక్త కార్యదర్శిగా యూ.శాంతిభూషణ్‌రావు, కోశాధికారిగా జూకంటి అమృతరావు, క్రీడు, సాంస్కృతిక కార్యదర్శిగా ఆకుల జనార్దన్‌ విజయం సాధించారు. కార్యవర్గ సభ్యులుగా ఎ.ఆనందరావు, ఎస్‌.శ్రీనివాసాచారి, పి.సత్యమంజు కుమార్‌, జేకే అనిత, కె.సంజీవ్‌, పి.సతీష్‌కుమార్‌, బి.యాదయ్య ఎన్నికయ్యారు.
  • 2018 మార్చి 29న హైకోర్టులో ఎన్నికలు నిర్వహించారు.

views: 1018

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams