Current Affairs Telugu Daily

457 వీసా అంటే
457 వీసా అంటే?
ఆస్ట్రేలియాలో విదేశీయులను నైపుణ్య ఉద్యోగులుగా నియమించుకునేందుకు ఉపయోగించే విధానమే 457 వీసా. దీనిపై వచ్చిన వాళ్లు నాలుగేళ్ల పాటు ఆస్ట్రేలియాలో పని చేయవచ్చు. 1990ల్లో వ్యాపారులకు, అత్యున్నత
నిపుణత కలిగిన వలసదారుల కోసం తెచ్చిన ఈ విధానాన్ని ఆ తర్వాత మరింత విస్తరించారు. ఈ వీసాలను తీసుకునే భారతీయుల సంఖ్య 19.5% కాగా ఆ తర్వాతి స్థానాల్లో యూకే, చైనా ఉన్నాయి.
అమెరికాలో హెచ్1బి వీసా నిబంధనలపై ట్రంప్ కఠిన నిబంధనల విధించిన నేపథ్యంలో పలు దేశాలు ట్రంప్‌నే అనుసరిస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియాతో పాటు 2016 నవంబర్‌లో బ్రిటన్ కూడా అంతర్గత బదిలీలపై
ఆంక్షలు విధించింది. దీని ప్రకారం భారత్ నుంచి అంతర్గత బదిలీ ద్వారా బ్రిటన్ వచ్చే ఉద్యోగికి కనిష్ట వేతన పరిమితిని 30 వేల పౌండ్లకు పెంచింది. ఇదే దారిలో సమగ్ర ఆర్థిక సహకార ఒప్పందాన్ని సమీక్షించే విషయంలో ప్రతిష్టంభన నెలకొనడంతో సింగపూర్ కూడా తమ ఉద్యోగాలు భారతీయులకు దక్కకుండా చూస్తోంది. ఇందుకోసం 2016 జనవరి నుంచి భారతీయ ఐటీ కంపెనీలకు వీసాల జారీని నామమాత్రం చేసింది. ఇదిలా ఉండగా చమురు ధరలు పడిపోవడంతో ఆయిల్‌పైనే ఆధారపడ్డ సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. దీంతో పలు పెద్దా, చిన్న
కంపెనీలు మూతపడటంతో ఏడాదిలో 80 వేల మంది భారతీయులు తిరిగివచ్చారు

views: 993

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams