Current Affairs Telugu Daily

డిప్యూటీ కలెక్టర్‌గా కిదాంబి శ్రీకాంత్‌
బ్యాడ్మింటన్‌ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్‌కు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డిప్యూటీ కలెక్టర్‌ నియామక ఉత్తర్వులు అందజేశారు. 2018 మార్చి 29న కోచ్‌ గోపీచంద్‌తో కలసి శ్రీకాంత్‌ ఉండవల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. ఈ సందర్భంగా ఇటీవలే పద్మశ్రీ అవార్డు అందుకున్నందుకు శ్రీకాంత్‌ను ముఖ్యమంత్రి అభినందించారు.
  • 2017 ఇండోనేసియా ఓపెన్‌ సిరీస్‌ నెగ్గిన తర్వాత శ్రీకాంత్‌ను విజయవాడలో జరిగిన సభలో సన్మానించిన చంద్రబాబు..  గ్రూప్‌-1 ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఉత్తర్వులు అందజేశారు.

views: 1090

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams