Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో అమలులోకి అద్దె నియంత్రణ చట్టం 
ఆంధ్రప్రదేశ్‌లోని పట్టణ ప్రాంతాల్లో నివాస, నివాసేతర అద్దె నియంత్రణ చట్టం-2017 అమలులోకి వచ్చింది. 2017 మార్చిలో అసెంబ్లీ ఆమోదంతో గవర్నర్‌ పరిశీలనకు వెళ్లిన ఈ చట్టానికి అనుమతి లభించడంతో 2018 మార్చి 28 నుంచి నుంచి అమలులోకి వచ్చేలా పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
  • జవహర్‌లాల్‌నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రాలు తప్పనిసరిగా అమలు చేయాల్సిన సంస్కరణల్లో పట్టణ ప్రాంతాల్లో నివాస, నివాసేతరాలపై అద్దె నియంత్రణ ఒకటి. 2015లో రూపొందించిన ముసాయిదాను గత ఏడాది పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదం తీసుకుంది.

views: 1120

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams