Current Affairs Telugu Daily

మరుగుదొడ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లాకు జాతీయ స్థాయిలో ప్రథమ స్థానం
తక్కువ కాలంలో ఎక్కువ మరుగుదొడ్లను నిర్మించిన జిల్లాగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. స్వచ్ఛభారత్‌ అభియాన్‌లో భాగంగా 2017-18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో 2,39,644 మరుగుదొడ్లను నిర్మించారు. 2017 అక్టోబర్‌ నాటికి జిల్లాలో 32శాతం కుటుంబాలకు మాత్రమే మరుగుదొడ్లు ఉండగా ఇపుడు 96 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు ఉన్నాయి.
  • చిత్తూరు జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా.. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌(2,38,141) రెండో స్థానం, బీహార్‌లోని సితమర్హి(2,27,616), ససారం(2,21,900) పశ్చిమ్‌ బంగాలోని ముర్షిదాబాద్‌ జిల్లా (2,21,356) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి.
  • మార్చి 28 నాటికి ఆంధ్రప్రదేశ్‌లో 94.35 శాతం కుటుంబాలకు మరుగుదొడ్లు ఉన్నట్లుగా జాతీయ గ్రామీణ మంచినీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ మంత్రిత్వ శాఖ తాజా సమాచారాన్ని తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.

views: 1088

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams