Current Affairs Telugu Daily

దేశీయ సోషల్‌ మీడియా స్టార్టప్‌ కంపెనీ ఏర్పాటుకు ఆర్థిక సాయం : మహీంద్రా గ్రూప్‌ 
వినూత్న ఆలోచనలతో, సోషల్‌ మీడియా స్టార్టప్‌ కంపెనీ ఏర్పాటు చేయాలనుకునే వారికి సాయం చేసేందుకు మహీంద్రా గ్రూప్‌ ముందుకొస్తోంది. దేశీయంగా సామాజిక మాధ్యమ కంపెనీని నెలకొల్పేందుకు ఆర్థిక సాయం చేస్తామని మహీంద్రా గ్రూప్‌ ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్రా వెల్లడించారు. కొత్త కంపెనీ ఏర్పాటుకు సీడ్‌ ఫండింగ్‌ ద్వారా సహకరిస్తామని తెలిపారు.
  • ‘ఫేస్‌బుక్‌’ నుంచి వినియోగదారుల సమాచారం బయటకు చేరుతోందని అంతర్జాతీయంగా ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఆనంద్‌ మహీంద్రా ప్రకటనకు ప్రాధాన్యం ఏర్పడింది.
  • ఫేస్‌బుక్‌ వినియోగదారులో 5 కోట్ల మంది వివరాలను, డేటా మైనింగ్‌ సంస్థ కేంబ్రిడ్డ్‌ అనలిటికా అక్రమంగా సేకరించిందని వెల్లడికావడం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆయా దేశాల్లో ఎన్నికలను ప్రభావితం చేసేలా, అక్కడి పౌరుల సమాచారాన్ని వినియోగించుకున్నారనేది ప్రధాన ఆరోపణ.

views: 1122



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams