Current Affairs Telugu Daily

యూఏఈ లాటరీలో భారతీయుడికి రూ.6.5 కోట్లు
యూఏఈలో మరో భారతీయుడికి జాక్‌పాట్‌ తగిలింది. దుబాయ్‌ డ్యూటీ ఫ్రీ నిర్వహించిన ఓ లాటరీలో పాతికేళ్ల ధనీష్‌ కొథరంబన్‌ 2018 మార్చి 27న మొదటి బహుమతి గెలుచుకున్నారు. దీనికింద ఆయనకు దాదాపు రూ.6.5 కోట్లు దక్కనున్నాయి.
  • ఇదే లాటరీలో జోర్డాన్‌ వాసి ఒకరు కూడా రూ.6.5 కోట్ల నగదు గెలుచుకున్నారు.
  • కేరళకు చెందిన ధనీష్‌ దుబాయ్‌లో ఏడాదిన్నర కాలంగా ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తున్నారు.
  • 2018 జనవరిలో కేరళవాసి ఒకరికి యూఏఈలో దాదాపు రూ.20 కోట్ల లాటరీ తగిలింది. 

views: 961



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams