Current Affairs Telugu Daily

క్షమాపణలు చెబుతూ బ్రిటన్‌ పత్రికల్లో ఫేస్‌బుక్‌ ప్రకటనలు
‘సమాచార దుర్వినియోగ’ వివాదంలో చిక్కుకున్న ఫేస్‌బుక్‌ ప్రజలకు క్షమాపణు చెబుతూ బ్రిటన్‌ దినపత్రికల్లో ప్రకటనలు ఇచ్చింది. చాలా వరకు పత్రికల్లో పూర్తి పేజీలో వీటిని అచ్చు వేయించింది.
  • 2014లో ఐదు కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులు వ్యక్తిగత సమాచారం కేంబ్రిడ్జ్‌ అనలిటికా అనే సంస్థకు అక్రమంగా చేరిన వ్యవహారంపై ప్రస్తుతం వివాదం నెలకొంది.
  • అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ కోసం ఈ కేంబ్రిడ్జ్‌ అనలిటికా పనిచేసింది.
  • ఈ సమాచార దుర్వినియోగం వివాదంపై విచారణకు హాజరుకావాలని ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్‌ జుకర్‌బర్గ్‌ను అమెరికా, బ్రిటన్‌, ఇతర ఐరోపా దేశాలు ఆదేశించాయి.
  • ఈ నేపథ్యంలో వినియోగదారులకు జుకర్‌బర్గ్‌ ఇప్పటికే క్షమాపణలు చెప్పారు. వినియోగదారుల సమాచారాన్ని రక్షించడం తమ బాధ్యత అని.. దాన్ని నిర్వర్తించలేకపోతే తాము సేవలందించేందుకు అనర్హులమని పేర్కొన్నారు. పత్రిక ప్రకటనల్లోనూ ఇదే విషయాన్ని పునరుద్ఘాటించారు.

views: 1147

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams