Current Affairs Telugu Daily

ప్రధాని విమానాల వివరాల సహ దరఖాస్తును తిరస్కరించిన ఎయిరిండియా
విదేశీ పర్యటనల కోసం ప్రధానమంత్రి వినియోగించిన విమానాల వివరాలు కోరుతూ సమాచార హక్కు(ఆర్‌టీఐ) చట్టం కింద దాఖలైన దరఖాస్తును జాతీయ విమానయాన సంస్థ ఎయిరిండియా తిరస్కరించింది. ప్రధాని కార్యాలయం సూచనల మేరకు భద్రతాపరమైన కారణాల రీత్యా ఈ వివరాలు తెలియజేయలేమని స్పష్టం చేసింది.
  • 2016 నవంబరు నుంచి ప్రధాని విదేశీ పర్యటనల కోసం ఎయిరిండియా పంపిన విమానాల అద్దెల వివరాలు కోరుతూ నౌకాదళ రిటైర్డ్‌ అధికారి లోకేష్‌ బత్రా 2018 ఫిబ్రవరి 2న సహ దరఖాస్తు దాఖలు చేశారు.
  • దీనిపై స్పందించిన కేంద్ర ప్రజా సమాచార అధికారి ప్రధాని విదేశీ పర్యటన కోసం ఉపయోగించిన విమానాల వివరాలు బహిర్గతం చేయడం భద్రతాపరమైన సమస్యలకు దారితీసే ముప్పుందంటూ పీఎంవో 2016 డిసెంబరు 26న తమకు రాసిన లేఖను బత్రాకు పంపించారు. కాబట్టి ప్రధాని పర్యటన వివరాలను వెల్లడించలేమని స్పష్టం చేశారు.

views: 1131

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams