Current Affairs Telugu Daily

ఇంధనశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం పార్లమెంటుకు నివేదిక
దేశంలోని 34 ప్రైవేటు థర్మల్‌ విద్యుత్తు ప్రాజెక్టు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నాయని, దీనివల్ల బ్యాంకులకు చెల్లించాల్సిన రూ.1.74 లక్షల కోట్లు మొండిబకాయిలు(ఎన్‌పీఏ)గా మారడానికి అవకాశాలున్నాయని విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు నేతృత్వంలోని ఇంధనశాఖ పార్లమెంటరీ స్థాయీసంఘం పార్లమెంటుకు నివేదిక సమర్పించింది.
  • సంబంధిత విద్యుత్తు ప్రాజెక్టులో విద్యుత్తు ఉత్పత్తికి అవసరమైన ఇంధనం లభ్యంకాకపోవడం, బొగ్గుగనుల రద్దు, లింకేజీలేకుండా ప్రాజెక్టు ఏర్పాటు, రాష్ట్ర ప్రభుత్వాలతో ముందస్తు ఒప్పందాలు చేసుకోకపోవడం, ఒప్పందం, టారిఫ్‌ వివాదాలు తదితర కారణాల వల్ల  ఇప్పుడు ఈ 34 ప్రాజెక్టులు రుణఒత్తిడిని ఎదుర్కొంటున్నట్లు స్థాయీసంఘం పేర్కొంది.
  • సమస్యను పరిష్కరించడానికి ఇంధన మంత్రిత్వశాఖ, దాని అనుబంధసంస్థలు సానుకూల దృక్పథంతో ఆలోచించాలని స్థాయీసంఘం సిఫార్సు చేసింది.
  • దేశంలో ఇప్పటికీ తలసరి విద్యుత్తు వినియోగం చాలా తక్కువగా ఉన్నట్లు స్థాయీసంఘం పేర్కొంది.
  • ఇప్పటికే జీవితకాలం  పూర్తిచేసుకున్న థర్మల్‌ విద్యుత్తు కేంద్రాలను మూసేయాలని సూచించింది.

views: 1154

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams