Current Affairs Telugu Daily

తెలంగాణలో అసైన్డ్‌ చట్టానికి సవరణ 
తెలంగాణ అసైన్డ్‌ భూముల చట్టం-1977కు సవరణ చేసిన చట్టానికి తెలంగాణ శాసనసభ 2018 మార్చి 24న ఆమోదముద్ర వేసింది.  ఈ చట్టం ప్రకారం అసైన్డ్‌ భూముల ఆక్రమణ, కొనుగోలు చేసిన వారిలో పేదలుంటే వారికి ఆ భూములపై హక్కులు కల్పిస్తారు.
  • పాతచట్టం ప్రకారం 2017 జనవరి 29కు ముందు ఆక్రమణలో ఉన్నవారికే అర్హత ఉండేది.
  • కొత్త చట్టంతో 2017 డిసెంబర్‌ 31 వరకు అసైన్డ్‌ భూముల్లో కొనుగోళ్లు, ఆక్రమణలకు పాల్పడిన వారిలో పేదలకు హక్కులు లభించనున్నాయి.
  • మెట్ట ఐదు ఎకరాలు, తరి అయితే రెండున్నర ఎకరాల వరకు నిరుపేదలకు హక్కులతో పాటు పట్టా, పాసు పుస్తకం జారీ చేయనున్నారు.
  • హైదరాబాద్‌ మెట్రో నగర పరిధిలో తాజా చట్టాన్ని అమలు చేయరు. 
  • తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ మంత్రి - మహమూద్‌ అలీ 

views: 1150

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams