Current Affairs Telugu Daily

తెలంగాణలో కొత్తగా 21 మున్సిపాలిటీలు
తెలంగాణ ప్రభుత్వం 21 నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్‌ చేసింది. ఈ మేరకు పురపాలకశాఖ 2018 మార్చి 24న ఉత్తర్వులు జారీ చేసింది. జనాభా, ఆదాయం, మౌలిక సదుపాయాలు, విస్తరిస్తున్న కాలనీలు, ఉపాధి తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ నియోజకవర్గమైన గజ్వేల్‌ మున్సిపాలిటీగా రూపాంతరం చెందింది. జీహెచ్‌ఎంసీ పరిధికి ఆవతల, ఔటర్‌ రింగు రోడ్డు పరిధిలోని బడంగ్‌పేట, పెద్ద అంబర్‌పేట నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా హోదా పెంచింది. ఆదిభట్ల, ఎలక్ట్రానిక్స్‌ పార్కు, బీడీఎల్‌ సంస్థలకు దగ్గర్లోని ఇబ్రహీంపట్నం ఇప్పటి వరకు నగర పంచాయతీగా ఉంది. ఇప్పుడు దీన్ని మున్సిపాలిటీగా మార్చారు. 
మున్సిపాలిటీలుగా మారిన 21 నగర పంచాయతీలు
1. బడంగ్‌పేట్‌
2. పెద్ద అంబర్‌పేట
3. నర్సంపేట
4. సత్తుపల్లి
5. గజ్వేల్‌
6. వేములవాడ
7. కల్వకుర్తి
8. ఇబ్రహీంపట్నం
9. హుజూర్‌నగర్‌
10. జమ్మికుంట
11. నాగర్‌ కర్నూలు
12. పరకాల
13. హుజూరాబాద్‌
14. మధిర
15. హుస్నాబాద్‌
16. బాదేపల్లి
17. అచ్చంపేట
18. అయిజ
19. దేవరకొండ
20. కొల్లాపూర్‌
21. ఆందోల్‌-జోగిపేట
  • తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి - కేటీ ఆర్ 

views: 1248

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams