Current Affairs Telugu Daily

కర్ణాటకలో అల్ప సంఖ్యాకులుగా లింగాయతులు
లింగాయతు, బసవతత్త్వాన్ని నమ్మిన వీరశైవుల్ని మత అల్ప సంఖ్యాకులుగా కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా గుర్తించింది. కర్ణాటక మత అల్ప సంఖ్యాకుల, హజ్‌, వక్ఫ్‌శాఖ 2018 మార్చి 23న ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతమున్న అల్ప సంఖ్యాకులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌలభ్యాలకు ఇబ్బంది కల్గించరాదనే ఆంక్షలకు లోబడి లింగాయతు, బసవతత్వాన్ని నమ్మిన వీరశైవుల్ని మత అల్ప సంఖ్యాకులుగా గుర్తించినట్లు అందులో పేర్కొంది. లింగాయతులను అల్ప సంఖ్యాకులుగా గుర్తించాలంటూ కేంద్రానికీ ఇటీవల  రాష్ట్ర మంత్రివర్గం ప్రతిపాదించింది.
views: 1072

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams