Current Affairs Telugu Daily

GHIAL దశాబ్ది ఉత్సవాలు
GMR హైదరాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని(GHIAL) ప్రారంభించి 10 సం॥లు అయిన సందర్భంగా దశాబ్ది ఉత్సవ కార్యక్రమాన్ని జీఎంఆర్‌ గ్రూప్‌ 2018 మార్చి 23న నిర్వహించింది. ఈ సందర్భంగా విమానాశ్రయ విస్తరణ పనులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ శ్రీకారం చుట్టారు. విమానాశ్రయ ప్రాంగణంలో నిర్మించనున్న దక్షిణాసియాలోనే అతిపెద్ద సమావేశ మందిరం (కన్వెన్షన్‌ సెంటర్‌) పనును కూడా ముఖ్యమంత్రి ప్రారంభించారు.
  • విమానాశ్రయాన్ని ప్రపంచ స్థాయి అనుసంధాన (కనెక్టివిటీ) కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు ప్రపంచశ్రేణి కంపెనీలను ఆకర్షించడానికి దేశంలోనే తొలి ఎయిర్‌పోర్ట్‌ సిటీని అభివృద్ధి చేసే పనులకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్‌ శ్రీకారం చుట్టారు.
  • విమానాశ్రయ దశాబ్ద ఉత్సవాన్ని పురస్కరించుకుని తపాలా శాఖ ప్రత్యేక స్టాంప్‌, కవర్‌ను విడుదల చేసింది.
  • సమావేశాలు, ప్రదర్శను (మైస్‌ రంగం) వంటి కార్యక్రమాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా తీర్చిదిద్దడానికి ప్రపంచ స్థాయి సమావేశ మందిరాన్ని (కన్వెన్షన్‌ కేంద్రం) విమానాశ్రయంలో ఏర్పాటు చేస్తున్నారు. 1,50,000 చదరపు అడుగు విస్తీర్ణంలో ఏర్పాటు చేసే ఈ కేంద్రంలో 10,000-12,000 మంది సమావేశం కావచ్చు.
  • తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు హైదరాబాద్‌ విమానాశ్రయం ద్వారా రాకపోకలు నిర్వహిస్తున్న ప్రయాణికులు ఏడాదికి సగటున 7 శాతం వృద్ధి చెందితే, 2014 తరవాత ఈ సంఖ్య 21 శాతం చొప్పున వృద్ధి చెందుతోంది. 
GHIAL-GMR Hyderabad International Airport Limited

views: 964

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams