Current Affairs Telugu Daily

లోక్‌పాల్‌ ఏర్పాటు కోసం అన్నాహజారే మరోసారి నిరవధిక దీక్ష 
లోక్‌పాల్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తూ సామాజిక ఉద్యమకారుడు అన్నాహజారే 2018 మార్చి 23న నుంచి డిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారు. అన్నాహజారే 2011లో ఇక్కడి నుంచే అవినీతి వ్యతిరేక ఉద్యమాన్ని ప్రారంభించారు. కేంద్రంలో లోక్‌పాల్‌, రాష్ట్రాల్లో లోకాయుక్తను ఏర్పాటు చేయాలంటూ హజారే ఎప్పటినుంచో డిమాండ్‌ చేస్తున్నారు.
  • వ్యవసాయరంగ సమస్యలకు పరిష్కారాలను సూచించిన స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికను అమలు చేయాలని కూడా అన్నాహజారే డిమాండ్‌ చేస్తున్నారు. 

views: 955



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams