Current Affairs Telugu Daily

లాభదాయక పదవుల కేసులో ఆప్‌ ఎమ్మెల్యేలపై అనర్హత వేటును కొట్టేసిన డిల్లీ హైకోర్టు 
లాభదాయక పదవుల కేసులో ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కి చెందిన 20 మంది ఎమ్మెల్యేలపై పడిన అనర్హత వేటును డిల్లీ హైకోర్టు 2018 మార్చి 23న కొట్టేసింది. ఈ అంశంపై మరోసారి విచారించి, నిర్ణయం తీసుకోవాలని కేసును తిరిగి ఎన్నికల సంఘానికి అప్పగించింది.
  • ఈ ఎమ్మెల్యేలు 2015ల  మార్చిలో డిల్లీ ప్రభుత్వంలోని మంత్రులకు పార్లమెంటరీ కార్యదర్శులుగా నియమితులయ్యారు.
  • ఇది లాభదాయక పదవి అని ఆరోపణలు వచ్చాయి. ఈ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఈసీ 2018 జనవరి 19న రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. మరుసటి రోజే రాష్ట్రపతి ఆమోదం తెలపడంతో ఆ 20 మందిని అనర్హులుగా ప్రకటిస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
  • దీనిపై ప్రజాప్రతినిధులు డిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. నోటిఫికేషన్‌పై స్టే విధించేందుకు 2018 జనవరి 24న హైకోర్టు నిరాకరించింది. అయితే సదరు నియోజకవర్గాల్లో ఖాళీలను భర్తీ చేయడానికి ఉపఎన్నిక తేదీని ప్రకటించడం వంటి చర్యలను చేపట్టరాదని ఈసీని ఆదేశించింది.
  • తాజాగా ఈ అంశంపై తీర్పును వెలువరించింది. ఆప్‌ ఎమ్మెల్యేలపై వేటు వేస్తూ ఇచ్చిన నోటిఫికేషన్‌ చట్టప్రకారం సరికాదని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ చందర్‌ శేఖర్‌తో కూడిన ధర్మాసనం పేర్కొంది.
  • దీనిపై ఈసీ చేసిన సిఫార్సులను తప్పుపట్టింది. ఇందులో సహజన్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగిందని పేర్కొంది. ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడానికి ముందు మౌఖిక వాదనలను వినలేదని వ్యాఖ్యానించింది.
  • ఈ కేసుపై మళ్లీ వాదనలు విని, ఆ తర్వాత.. ‘లాభదాయక పదవి అంటే ఏమిటి’ వంటి ముఖ్యమైన అన్ని అంశాలపై నిర్ణయం తీసుకోవాలని ఈసీని ఆదేశించింది. 
  • డిల్లీ ముఖ్యమంత్రి - అరవింద్‌ కేజ్రీవాల్‌ 

views: 958

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams