Current Affairs Telugu Daily

పాక్‌కు శక్తిమంతమైన క్షిపణి గమన వ్యవస్థ సరఫరా చేసిన చైనా
మల్టీ వార్‌హెడ్‌ క్షిపణుల అభివృద్ధిని వేగిరపరిచేందుకు దోహదపడే శక్తిమంతమైన క్షిపణి గమన వ్యవస్థను పాకిస్థాన్‌ సొంతం చేసుకుంది. తనకు అతిపెద్ద ఆయుధ సరఫరాదారు అయినా చైనా నుంచి దీనిని పాక్‌ కొనుగోలు చేసింది. అత్యాధునికమైన ట్రాకింగ్‌ సిస్టమ్‌ను తమ మిత్ర దేశానికి అందించామని, కొత్త క్షిపణుల అభివృద్ధికి సంబంధించిన ప్రయోగాలను పాక్‌ సైన్యం ఇప్పటికే ప్రారంభించిందని చైనా అకాడమీ ఆఫ్‌ సైన్సెస్‌(సీఏఎస్‌)కు చెందిన శాస్త్రవేత్త రెంగ్‌ మెంగ్వే వెల్లడించినట్లు హాంగ్‌కాంగ్‌ నుంచి వెలువడే సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది.
  • భారత్‌ వద్ద ఉన్న ఖండాంతర క్షిపణి అగ్ని-5ని సమర్థంగా ఎదుర్కోవాంటే పాకిస్థాన్‌ వద్ద ఒకే సమయంలో బహుళ లక్ష్యాలను నిర్దేశించుకొని, స్వయంచాలితంగా గురిని నిర్దేశించుకోగల క్షిపణి గమన వ్యవస్థలు ఉండటం అవసరమేనని ఆ శాస్త్రవేత్తలు అభిప్రాయపడినట్లు తెలిపింది.
  • ఈ ఆధునిక క్షిపణి గమన వ్యవస్థను ఎంత మొత్తానికి పాక్‌ కొనుగోలు చేసిందనే విషయాన్ని వెల్లడించలేదు.
  • హైస్పీడ్‌ కెమేరాలు, లేజర్‌ రేంజర్లతో కూడిన శక్తిమంతమైన జత టెలిస్కోప్‌లు దీనిలో ఉంటాయి.
  • ఇన్‌ఫ్రారెడ్‌ డిటెక్టర్లు, కేంద్రీకృత కంప్యూటర్‌ వ్యవస్థ కూడా కలిగిన ఈ వ్యవస్థ స్వయంచాలితంగా లక్ష్యాలు నమోదు చేసుకుని, గురిపెడుతుంది.
  • ప్రయోగవేదిక నుంచి క్షిపణి బయలుదేరింది మొదలు, వాతావరణంలోకి ప్రవేశించే సమయం, వార్‌హెడ్స్‌ను విడుదల చేసే వరకూ ప్రతి దశనూ ఈ పరికరం నమోదు చేస్తుంది.
  • చైనా తయారు చేసిన క్షిపణి గమన వ్యవస్థలో ప్రత్యేకత ఏమిటంటే సాధారణంగా అవసరమైన జత టెలిస్కోప్‌కంటే అదనంగా 4 టెలిస్కోప్‌లు ఉంటాయి.
  • వీటితో కొన్ని వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను, కదలికలను కచ్చితంగా గుర్తించి క్షిపణులను గురి తప్పకుండా నిర్దేశిస్తాయని సీఏఎస్‌ శాస్త్రవేత్త రెంగ్‌ వివరించినట్లు సౌత్‌ చైనా మార్నింగ్‌ పోస్ట్‌ పేర్కొంది.

views: 1094



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams