Current Affairs Telugu Daily

అమరవీరుల పిల్లలకు విద్యాసాయంపై పరిమితి ఎత్తివేత
పోరాటంలో మరణించిన లేదా వైకల్యం పొందిన సైనికుల పిల్లలకు విద్యాసాయం కింద ఇచ్చే మొత్తంపై ఉన్న పరిమితిని కేంద్ర ప్రభుత్వం తొలగించింది. ఒక్కో విద్యార్థికి ఇచ్చే మొత్తాన్ని నెలకు రూ.10వేలకు పరిమితం చేస్తూ 2017 జులైలో ఆదేశాలు జారీ చేసింది.
  • దీనిపై త్రివిధ దళాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో పరిమితి లేకుండానే విద్యా రాయితీ కొనసాగుతుందని కేంద్ర ఆర్థికశాఖ పేర్కొంది.
  • ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలలు, విద్యా సంస్థలు లేదా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన సంస్థల్లో విద్యాభ్యాసం చేసేటప్పుడే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సాయంతో నడిచే స్వయంప్రతిపత్తి సంస్థల్లోని విద్యార్థులకూ ఇది వర్తిస్తుందని వివరించింది.

views: 1087

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams