Current Affairs Telugu Daily

కర్ణాటకలో ‘లింగాయత’కు మతం హోదా 
‘లింగాయత’ను ప్రత్యేక మతం, ధర్మంగా గుర్తించవచ్చని జస్టిస్‌ నాగమోహనదాస్‌ ఇచ్చిన నివేదికను కర్ణాటక మంత్రివర్గం 2018 మార్చి 19న ఆమోదించింది. బసవతత్వాన్ని అనుసరించే లింగాయత-వీరశైవ లింగాయతకు మైనార్టీ హోదాను కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో మంత్రులు విధానసౌధలో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. లింగాయత అంశంపై అమాత్యుల మధ్య తీవ్ర వాద ప్రతివాదను కొనసాగాయి. చివరికి లింగాయతను ప్రత్యేక మతంగా గుర్తించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని నిర్ణయించారు.
views: 1287

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams