Current Affairs Telugu Daily

బిహార్‌ సీఎం నీతీశ్‌పై పిల్‌ను కొట్టివేసిన సుప్రీంకోర్టు
బిహార్‌ సీఎం నీతీశ్‌కుమార్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయన ఎమ్మెల్సీ పదవిని రద్దు చేయాలని దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. 1991లో ఓ హత్యకేసులో నిందితుడిగా ఉన్న విషయాన్ని ఎన్నికల సంఘం ప్రమాణపత్రంలో ఉద్దేశపూర్వకంగానే దాచిపెట్టారని నీతీశ్‌పై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఎం.ఎల్‌.శర్మ అనే అడ్వొకేట్‌ సుప్రీంలో ఆర్టికల్‌ 32 కింద పిల్‌ దాఖలు చేశారు.
  • సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌మిశ్ర, జస్టిస్‌ ఎ.ఎం.ఖన్వ్కిర్‌, జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం పిల్‌ను విచారించింది. వ్యాజ్యంలో విషయం లేదని పెదవి విరిచింది.
  • క్రిమినల్‌ కేసులో సదరు వ్యక్తి పాత్ర ఉందని న్యాయమూర్తి భావిస్తేనే.. తనపై కేసు పెండింగ్‌లో ఉందన్న విషయాన్ని ఎన్నికల సంఘం ప్రమాణపత్రంలో అభ్యర్థి వెల్లడించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
  • క్రిమినల్‌ కేసులో నిందితుడు అనే సంగతిని 2009లో న్యాయస్థానం గుర్తించిన అనంతరం, 2012లో ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాలన్న నీతీశ్‌కుమార్‌ విన్నపాన్ని ధర్మాసనం మన్నించింది.
  • కింది కోర్టు విచారణను ఇప్పటికే పట్నా హైకోర్టు నిలిపివేసిందన్న నీతీశ్‌ తరఫు న్యాయవాది వాదనతో ఏకీభవించి వ్యాజ్యాన్ని కొట్టివేసింది.

views: 1074

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams