Current Affairs Telugu Daily

పెట్టుబడి సలహాదారు అనిరుధ్‌ సేథీపై SEBI నిషేధం
నమోదుకాని పెట్టుబడి సలహాదారుపై SEBI కొరడా ఝుళిపించింది. ‘ఫాతల్‌ అట్రాక్షన్‌’ పథకంతో పేరు పొందిన పరిశోధనా విశ్లేషకుడు అనిరుధ్‌ సేథీని సెక్యూరిటీ మార్కెట్‌ నుంచి నిషేధిస్తున్నట్లు SEBI ప్రకటించింది.
  • ఇన్వెస్టర్ల నుంచి వసూలు చేసిన ఫీజులు వెనక్కి చెల్లించాల్సిందిగా ఆదేశించింది.
  • 2013 ఏప్రిల్‌ 1 నుంచి 2016 ఏప్రిల్‌ 20 మధ్య దేశంలోని పలు ప్రాంతాల్లో సేథీ బ్యాంక్‌ ఖాతాలోకి రూ.36,000 చొప్పున పలు సార్లు జమ అయ్యాయని SEBI దర్యాప్తులో తేలింది.
  • వెబ్‌సైట్‌ వివరాలు, పోస్ట్‌లు, ట్వీట్లు, బ్యాంక్‌ ఖాతా వివరాలు, ఆదాయపు పన్ను రిటర్న్‌లను పరిశీలించిన SEBI సేథీ బ్యాంక్‌ ఖాతాల్లో రూ.10 కోట్లకు పైగా జమయినట్లు గుర్తించింది.
  • SEBI ఛైర్మన్‌ - అజయ్‌త్యాగి
  • SEBI ఏర్పాటు - 1992 ఏప్రిల్‌ 12
  • SEBI ప్రధాన కార్యాలయం - ముంబై
SEBI-Securities and Exchange Board of India

views: 1082

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams