Current Affairs Telugu Daily

జాతీయ నేర నమోదు విభాగం గణాంకాలు
బాలలపై జరుగుతున్న నేరాలు 2015-16 మధ్యకాంలో 11 శాతానికి పైగా పెరిగినట్లు జాతీయ నేర నమోదు విభాగం(NCRB) విడుదల చేసిన గణాంకాల్లో వెల్లడయింది. 2015లో దేశ వ్యాప్తంగా 94,172 కేసులు నమోదుకాగా.. 2016లో ఈ సంఖ్య 1,06,958కు చేరింది. స్వచ్ఛంద సంస్థ ‘క్రై చైల్డ్‌ రైట్స్‌ అండ్‌ యు’ పరిశోధన ఈ విషయాన్ని ఇదివరకే వెల్లడించింది. గత దశాబ్ద కాలంలో బాలలపై నేరాలు 500 శాతం మేర పెరిగాయని (2006లో 18,967 నుంచి 2016లో 1,06,958కు) క్రై పేర్కొంది.
  • ఎన్‌సీఆర్‌బీ సమాచారం ప్రకారం.. బాలలపై 50 శాతానికిపైగా నేరాలు ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, డిల్లీ, పశ్చిమ బెంగాల్‌లోనే నమోదయ్యాయి. వీటిలో 15 శాతంతో ఉత్తరప్రదేశ్‌ మొదటి స్థానంలో ఉంది. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌.. 14, 13 శాతాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
  • చిన్నారులపై నేరాల్లో అపహరణ కేసులే ఎక్కువగా ఉన్నాయి. 2016లో నమోదైన మొత్తం కేసుల్లో వీటి వాటా 48.9 శాతం (52,253) వరకూ ఉంది. 
  • అపహరణ తర్వాత స్థానంలో అత్యాచారాలున్నాయి. వీటి వాటా 18 శాతం. మరోవైపు పోక్సో చట్టం కింద నమోదైన కేసులు 33 శాతం వరకూ ఉన్నాయి. లైంగిక దాడులు, వేధింపులు, అశ్లీల దృశ్యాల చిత్రీకరణ తదితర నేరాలను పోస్కో కింద నమోదుచేస్తారు. 
  • 2016లో దేశ వ్యాప్తంగా ఆచూకీ గల్లంతైన చిన్నారుల సంఖ్య 1,11,569 (41,175 మంది బాలురు, 70,394 మంది బాలికలు)గా ఉంది. ఈ కేసుల్లో పశ్చిమ బెంగాల్‌ (15.1 శాతం) మొదటి స్థానంలో ఉంది. 2016 చివరినాటికి మొత్తంగా 55,944 మంది ఆచూకీ గల్లంతైన చిన్నారులను పోలీసులు పట్టుకోగలిగారు. 
  • వయో వృద్ధులపై జరుగుతున్న నేరాల్లో దాదాపు 40 శాతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనే నమోదవుతున్నాయి. 2016లో దేశవ్యాప్తంగా వయో వృద్ధులపై 21,410 నేరాలు జరిగాయి. వీటిలో 40.03 శాతం (7,419 కేసులు) మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లోనే వెలుగుచూశాయి. 2014లో ఈ రెండు రాష్ట్రాల్లో ఇవి 39.64 శాతం, 2015లో 39.04 శాతంగా ఉన్నాయి. వృద్ధులను మోసం, దోపిడీ, వారిపై దాడులను వీటిలో నేరాలుగా పేర్కొన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్ర దీనిలో అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలున్నాయి.
  • NCRBను 1986 మార్చి 11న ఏర్పాటు చేశారు
  • NCRB ప్రధాన కార్యాలయం - న్యూడిల్లీ 
NCRB-National Crime Records Bureau

views: 998

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams