Current Affairs Telugu Daily

కృత్రిమ గుండెను రూపొందించిన చైనా శాస్త్రవేత్తలు
రాకెట్‌ నిర్మాణ సాంకేతికతను ఉపయోగించి చైనా శాస్త్రవేత్తలు కృత్రిమ గుండెను రూపొందించారు. ఇప్పటికే వీటిని 6 గొర్రెలకు అమర్చగా... అవన్నీ ఆరోగ్యంగా జీవనం సాగిస్తున్నాయి.
  • చైనా అకాడమీ ఆఫ్‌ లాంచ్‌ వెహికిల్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు విద్యుత్తును చోదకశక్తిగా మార్చే రాకెట్‌ సర్వో సిస్టంను ఆధారం చేసుకుని కృత్రిమ గుండె (స్పేస్‌హార్ట్‌)ను తయారుచేశారు.
  • ఇందుకు టెడా ఇంటర్నేషనల్‌ కార్డియోవాస్క్యుర్‌ ఆసుపత్రి వైద్యుల సహాయం తీసుకున్నారు. వారి సూచనల మేరకు ద్రవ-వాయువును నియంత్రించే అయస్కాంత కృత్రిమ గుండెను తయారుచేశారు.
  • ఇదెంతో ప్రభావవంతంగా పనిచేస్తోందనీ, దీర్ఘకాల జీవితానికి భరోసా ఇవ్వగలదని చెబుతున్నారు.
  • ఇప్పటికే గత ఏడాదిలో ఆరు గొర్రెలకు ఈ ‘స్పేస్‌హార్ట్‌’ను పరిశోధకులు విజయవంతంగా అమర్చగలిగారు. వైద్య పరీక్షలన్నీ పూర్తిచేసుకుని 2020 నాటికల్లా ఇది రోగులకు అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

views: 1309

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams