Current Affairs Telugu Daily

ప్రపంచంలో జీవనవ్యయం అత్యంత తక్కువగా ఉన్న నగరం డెమాస్కస్‌ 
ప్రపంచంలో జీవనవ్యయం అత్యంత తక్కువగా ఉన్న నగరాల్లో సిరియా రాజధాని డెమాస్కస్‌ ప్రథమ స్థానంలో ఉంది. అత్యంత ఖరీదైన నగరంగా సింగపూర్‌ వరుసగా అయిదో ఏడాదీ నిలిచింది.
  • ప్రపంచంలోనే నివాసానికి అత్యంత చౌకగా ఉన్న నగరాలపై ఎకనమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ సర్వే చేపట్టి, ‘ప్రపంచవ్యాప్త జీవనవ్యయం 2018 నివేదిక’ను విడుదల చేసింది.
  • ఈ జాబితాలో ప్రపంచంలోనే నివాసానికి అత్యంత చౌకగా ఉన్న 10 నగరాల్లో భారత్‌కు చెందిన బెంగళూరు (5వ స్థానం), చెన్నై (8వ స్థానం), డిల్లీ (10వ స్థానం) ఉన్నాయి.
  • దక్షిణాసియా దేశాల్లో ముఖ్యంగా భారత్‌, పాకిస్తాన్‌లో ఖర్చు పెట్టే ప్రతి పైసాకు తగిన విలువ లభిస్తుందని  సర్వే వివరించింది.
  • వేగవంతమైన ఆర్థిక వృద్ధి పథంలో భారత్‌ ఉంది. అయితే తలసరి ఆదాయ పరంగా చూసినా, వేతనాలు, ఖర్చులో వృద్ధి మాత్రం తక్కువగానే ఉంది. వేతన వ్యత్యాసాలను పరిగణనలోకి తీసుకుంటే, తక్కువ వేతనాలే ప్రమాణంగా ఉంటున్నాయి. ఇందువల్ల కుటుంబాల వ్యయం పరిమితంగా ఉంటోంది.
  • రిటైల్‌ ఉత్పత్తులు కూడా అన్ని శ్రేణుల్లో లభిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల నుంచి  చౌక ఉత్పత్తులు భారీగా నగరాలకు తరలి వస్తున్నాయి. ఇందువల్ల సరఫరా వ్యవస్థ పరిమాణం తక్కువగానే ఉంటోంది. కొన్ని ఉత్పత్తులపై ప్రభుత్వ రాయితీల వల్ల వాటి ధరలు తక్కువగా ఉంటున్నాయని నివేదిక తెలిపింది.
  • ఆహారం, నీరు, దస్తులు, వ్యక్తిగత-గృహ సంరక్షణ ఉత్పత్తులు, ఇళ్ల అద్దె, రవాణా, వినియోగ బిల్లు, ప్రైవేటు పాఠశాలలు, ఇంటి సహాయకులు (పనిమనుషులు), వినోద వ్యయాల వంటి 160 రకాల ఉత్పత్తులు, సేవలను 400 ప్రాంతాల్లో పరిశీలించి, ఈ నివేదిక రూపొందించారు.

views: 1178



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams